Updated : 14 Nov 2021 08:28 IST

Anand Devarakonda: అంచనాలు నిజమయ్యాయి

- ఆనంద్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ సైనీ, శాన్వి మేఘన నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర తెరకెక్కించారు. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంపై ఉన్న అంచనాలు నిజమయ్యాయి. ఒక మంచి సినిమాకి ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో.. అంత ఇస్తున్నారు ప్రేక్షకులు. నా నటనతో పాటు ఇద్దరు నాయికల అభినయం బాగుందని చెబుతున్నారు. కథలో సందర్భానుసారంగా వచ్చే కామెడీ సీన్స్‌కు ప్రేక్షకులు బాగా నవ్వుతున్నార’’న్నారు. ‘‘సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. నేను చెప్పింది నమ్మి, సినిమా కోసం అడిగింది ఇచ్చి ఆనంద్‌, విజయ్‌ ఎంతో సహకరించారు. వాళ్ల వల్లే ఇంత మంచి విజయం దక్కింది’’ అన్నారు చిత్ర దర్శకుడు. నాయిక గీత్‌ సైని మాట్లాడుతూ.. ‘‘మీనాక్షి పాత్రకు ఎలా స్పందన వస్తుందోనని టెన్షన్‌ పడ్డాను. కానీ, థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులు నా పాత్రను ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు’’ అంది. ‘‘సినిమాలో ఎక్కడెక్కడ ప్రేక్షకులు నవ్వుతారని మేము ఊహించామో.. ఆ సీన్లన్నింటికీ మంచి ఆదరణ దక్కుతోంది. నా రేఖ పాత్రను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు’’ అంది మరో నాయిక శాన్వి. ఈ కార్యక్రమంలో హర్ష వర్ధన్‌, గిరిధర్‌, అనురాగ్‌ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని