R Narayana Murthy: ఏపీలో సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది!

థియేటర్ల పరిస్థితిని తలచుకుని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 27 Dec 2021 17:40 IST

హైదరాబాద్‌: థియేటర్ల పరిస్థితిని తలచుకుని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌కు హాజరైన నారాయణమూర్తి మాట్లాడారు. ‘‘ఉత్తరాంధ్రలో కొన్ని సినిమా థియేటర్లు మూసివేశారనే వార్తలు చదువుతుంటుంటే ఏడుపొస్తుంది. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు బాగుంటేనే చలన చిత్ర పరిశ్రమ బాగుంటుంది. ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి కోట్లాదిమంది బతుకుతున్నారు. ఈ విషయమై ఫిల్మ్‌ ఛాంబర్‌ పెద్దల్ని, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ పెద్దల్ని, ‘మా’ అధ్యక్షుడికి, సినీ నిర్మాతలు, నటులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థియేటర్ యజమానులారా సినిమా హాళ్లను మూయకండి. స్థానిక మంత్రుల్ని కలవండి. సమస్యని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ గారికి దగ్గరకు తీసుకెళ్లండి. ప్రభుత్వంతో పాజిటివ్‌గా ఉండండి. నెగెటివ్‌గా ఆలోచించ వద్దు. ఎమోషన్‌ అవ్వొద్దు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిగారికి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు.

ఇదే కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘థియేటర్ల పరిస్థితి గురించి నాని ఒక విధంగా మాట్లాడితే కొందరు మరొక విధంగా తీసుకున్నారు. ఆరోజు నాని ఎమోషన్‌తో మాట్లాడారు తప్ప నెగెటివ్‌గా స్పందించలేదు. ఎవరూ ఆయన్ను తప్పుగా అర్థంచేసుకోకండి’ అని అభ్యర్థించారు.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని