Peddanna: పవర్‌ఫుల్‌ సాంగ్‌తో సందడి చేస్తోన్న రజనీకాంత్‌ 

 ప్రముఖ నటుడు రజనీకాంత్‌ దీపావళికి ‘పెద్దన్న’ చిత్రంతో సందడి చేయనున్నారు. శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మరికొన్ని రోజుల్లోనే విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది.

Published : 29 Oct 2021 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో)ను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతానికి డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. ముకేశ్‌ ఆలపించారు. ఈ వీడియోలో రజనీకాంత్‌ మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ పంచాయతీ ప్రెసిడెంట్‌ వీరన్నగా నటించారు. ఆయన సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించనుంది. రజనీకాంత్‌ సరసన నయనతార సందడి చేయనుంది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని