
PV Sindhu: పీవీ సింధు, చిరంజీవితో రాధిక
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, నటులు చిరంజీవి, రాధికా శరత్ కుమార్‌ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూస్తుండటం భలే ఉంది కదూ. ఈ ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రాధిక. ‘పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో నేను పాల్గొనడం గొప్ప అనుభూతి పంచింది’ అని పేర్కొన్నారు. అయితే అది ఎక్కడ? అనే వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌గా రికార్డు సృష్టించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.