Rajkundra: మరదల్ని లీడ్‌గా పెట్టి.. కొత్త యాప్‌ ప్రారంభించాలనుకున్నాడు

అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఇటీవల...

Published : 24 Jul 2021 01:10 IST

నటి గహనా వశిష్ఠ్‌ ఏం చెప్పారంటే..

ముంబయి: అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌కుంద్రా సంస్థలో తెరకెక్కిన మూడు సినిమాల్లో నటించిన గహనా వశిష్ఠ్‌ తాజాగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. శుక్రవారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గహనా..  రాజ్‌కుంద్రాకి మద్దతు తెలుపుతూ మాట్లాడారు.

‘అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేయడానికి కొన్నిరోజుల ముందు నేను కుంద్రా కార్యాలయానికి వెళ్లాను. ‘బాలీఫేమ్‌’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో రాజ్‌ ఉన్నట్లు అక్కడికి వెళ్లాక తెలిసింది. రియాల్టీ షోలు, సెలబ్రిటీ ఛాట్‌ షోలు, మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌ వంటి నాన్‌ బోల్డ్‌ కంటెంట్‌తో ఈ యాప్‌ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌గా  స్క్రిప్ట్‌ ఓకే చేశాం. షమితా సైతం నటించడానికి గ్రీన్‌ సిగ్నలిచ్చింది’ అని గహనా వివరించారు.

ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ వీడియో షూట్‌ ఈ ‘పోర్న్‌ రాకెట్‌’ గుట్టు బయటపెట్టింది. ముంబయి శివారు ప్రాంతంలోని ఓ బంగ్లాలో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అరెస్ట్‌ చేశారు. అలా, అరెస్టైన వారిలో గహనా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, తాము పోర్న్‌ వీడియోలు చిత్రీకరించలేదని.. పోలీసులే అక్రమంగా తమపై కేసులు బనాయించారని ఆమె ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని