Anubhavinchu Raja: బంగారం మనసు అలాంటిది

‘వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా. బంగారంగా కాదు... ప్రెసిడెంట్‌ బంగారంగా’ అంటూ ఊర్లో శపథం చేశాడు. మరి అది సాధ్యమైందో లేదో తెలియాలంటే ‘అనుభవించు రాజా’

Updated : 18 Nov 2021 07:19 IST

‘వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా. బంగారంగా కాదు... ప్రెసిడెంట్‌ బంగారంగా’ అంటూ ఊర్లో శపథం చేశాడు. మరి అది సాధ్యమైందో లేదో తెలియాలంటే ‘అనుభవించు రాజా’ చూడాల్సిందే. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కశిష్‌ఖాన్‌ కథానాయిక. శ్రీను గవిరెడ్డి  దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం కథానాయకుడు నాగార్జున ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘బంగారంగాడి మనసు సినిమాహాల్‌ లాంటిది. వారానికో సినిమా వస్తా ఉంటది. పోతా ఉంటది... ఏదీ పర్మనెంట్‌గా ఉండదు...’ అంటూ రాజ్‌తరుణ్‌ అల్లరి చేయడం ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచింది. సెక్యూరిటీ గార్డ్‌గా, ఊళ్లో జాలీగా తిరిగే కుర్రాడిగా రెండు కోణాల్లో కనిపించాడు రాజ్‌తరుణ్‌. పోసాని, నరేన్‌, అజయ్‌,    సుదర్శన్‌, అరియానా, భూపాల్‌రాజు, ఆదర్శ్‌ బాలృష్ణ, రవికృష్ణ, టెంపర్‌ వంశీ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: నాగేష్‌ బానెల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని