Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

విక్రమ్‌.. ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్‌. చిన్నప్పుడు కృష్ణ సినిమాలు, పెద్దయ్యాక టామ్‌క్రూజ్‌ చిత్రాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరాడు.

Updated : 01 Nov 2021 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌.. ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్‌. చిన్నప్పుడు కృష్ణ సినిమాలు, పెద్దయ్యాక టామ్‌క్రూజ్‌ చిత్రాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరాడు. కొన్నాళ్లకి తన సరదా తీరిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? తెలియాలంటే ‘రాజా విక్రమార్క’ సినిమా చూడాల్సిందే. కార్తికేయ హీరోగా శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కార్తికేయ కనిపించనున్నారు. తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు నాని ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ, ట్విస్ట్‌లతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కార్తికేయ నటన, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తికేయని ఉద్దేశించి ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి ,‘దీపావళి.. గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌’ అంటూ కార్తికేయ అలరించారు. రమణ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని