Rajamouli: సల్మాన్‌ను కలిసిన రాజమౌళి!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ని కలిసినట్లు తెలుస్తోంది.  శనివారం ముంబయిలో తన తనయుడు కార్తికేయతో కలిసి కొంతసేపు సల్మాన్‌తో ముచ్చటించినట్లు బాలీవుడ్‌ సమాచారం.

Published : 22 Nov 2021 20:21 IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ని కలిసినట్లు తెలుస్తోంది.  శనివారం ముంబయిలో తన తనయుడు కార్తికేయతో కలిసి కొంతసేపు సల్మాన్‌తో ముచ్చటించినట్లు బాలీవుడ్‌ సమాచారం. ఇద్దరి  కలయికపై పలు రకాల వార్తలొస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం కోసమే కలిశాడని, ప్రీ రిలీజ్‌ వేడుకకు అతిథిగా ఆహ్వానించడానికి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందంటూ కూడా వదంతులు వస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు.  జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని