Shekar: సంక్రాంతి బరిలో రాజ‘శేఖర్‌’ చిత్రం?

టాలీవుడ్‌ విషయంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి ఉత్కంఠ పెంచుతోంది.

Published : 02 Jan 2022 22:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌కి సంబంధించి ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి ఉత్కంఠ పెంచుతోంది. పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొస్తుందనుకున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదాతో పరిస్థితి మారిపోయింది. ఊహించని విధంగా పలు చిన్న చిత్రాలు విడుదలకు రంగం సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ‘శేఖర్‌’ సినిమా నిలవనుందని సినీ వర్గాల సమాచారం. రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి, నటి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రమిది. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌కు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కావాల్సిన జనవరి 7న ఆది సాయికుమార్‌ ‘అతిథి దేవోభవ’ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 14న ‘డిజె టిల్లు’, ‘సూపర్‌ మచ్చి’, జనవరి 15న ‘హీరో’ సినిమాలు విడుదలకాబోతున్నాయి. ‘రౌడీబాయ్స్‌’, ‘7 డేస్‌ 6 నైట్స్‌’ సంక్రాంతి సమయంలోనే రానున్నాయి. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్న నాగార్జున- నాగచైతన్య చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతికే రానుంది. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’ను సైతం వాయిదా వేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చిత్రబృందం స్పష్టతనివ్వడంతో ఆ చిత్రం కూడా సంక్రాంతికే సందడి చేయనుంది. 

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని