Annaatthe: ‘అన్నాత్తే’ ఓవర్సీస్‌ రికార్డు.. 1193 థియేటర్లలో రజనీకాంత్‌ చిత్రం

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ‘అన్నాత్తే’ రికార్డు సృష్టించింది. సుమారు 1193 విదేశీ స్క్రీన్లలో ఈ చిత్రం సందడి చేయనుంది.

Published : 02 Nov 2021 16:33 IST

చెన్నై: కొవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ‘అన్నాత్తే’ రికార్డు సృష్టించింది. సుమారు 1193 విదేశీ స్క్రీన్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం విడుదలకానున్న దేశాలు, థియేటర్ల సంఖ్యని ప్రకటించింది. యు.ఎస్‌.ఎ. (677), యు.ఎ.ఇ. (117), మలేషియా (110), శ్రీలంక (86), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ (85), యూరప్‌ (43), యు.కె. (35), సింగపూర్‌ (23), కెనడా (17)లో ఈ సినిమా ప్రదర్శితంకానుంది. రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రమిది. నయనతార కథానాయిక. కీర్తి సురేశ్‌, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేస్తున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రాబోతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని