Annaatthe: ఓటీటీలో విడుదలైన రజనీకాంత్‌ ‘పెద్దన్న’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన  చిత్రం ‘పెద్దన్న’. నయనతార కథానాయిక. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 25 Nov 2021 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘పెద్దన్న’. నయనతార కథానాయిక. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం అందుకుంది. తాజాగా డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. తమిళంలో ‘అన్నాత్తే’ పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైంది.

క‌థేంటంటే: రాజోలు చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు పంచాయ‌తీ పెద్ద వీర‌న్న (ర‌జ‌నీకాంత్‌). ఆయ‌నకి చెల్లెలు క‌న‌క‌ మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేష్‌) అంటే ప్రాణం. ఆమె పిలిస్తే ప‌ల‌క‌డం కాదు, త‌లిస్తేనే ప‌లికేంత‌గా ఉంటుంది ఇద్ద‌రి మ‌ధ్య బంధం. చ‌దువుకునేందుకు ప‌ట్నం వెళ్లి తిరిగొస్తుందంటే ఊళ్లోనే కాదు, ఆమె ఎక్కొచ్చిన రైలు బండికి కూడా పండ‌గే. క‌న‌క మ‌హాల‌క్ష్మికి చుట్టు ప‌క్క‌లే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు వీర‌న్న‌. మొద‌ట శ‌త్రువుగా ఉండి, ఆ త‌ర్వాత మిత్రుడైన ప్ర‌కాశ్‌రాజ్  కొడుకుతో పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. అన్నయ్య మాట జ‌వదాట‌ని చెల్లెలు ఆ పెళ్లికి అంగీకారం తెలుపుతుంది. తీరా పెళ్లి ముహూర్తానికి ముందు మ‌హాల‌క్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇంత‌కీ ఆమె ఎందుకు వెళ్లిపోయింది? వెళ్లాక ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? త‌న మాట కాద‌ని వెళ్లిన చెల్లెలి గురించి వీర‌న్న ప‌ట్టించుకున్నాడా?లేదా? అనేది మిగతా కథ.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని