Jyotika: హత్తుకునేలా ‘రక్త సంబంధం’.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్‌ చూశారా!

జ్యోతిక, శశి కుమార్‌, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. శర్వణన్‌ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Published : 04 Oct 2021 22:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జ్యోతిక, శశి కుమార్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. శర్వణన్‌ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా ఉంది. జ్యోతిక అన్నయ్యగా శశికుమార్‌, భర్తగా సముద్రఖని కనిపించారు. ముగ్గురి నటన ఆకట్టుకుంటుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే శశి, సముద్రఖని ఒకానొక సందర్భంలో మాటకిమాట అనుకుంటారు. ఈ సీన్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. జ్యోతిక నటించిన 50వ చిత్రమిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని