Aasha Encounter: ఎన్‌కౌంటర్‌ వెనుక...

శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సోనియా ఆకుల, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆశా ఎన్‌కౌంటర్‌’. ఆనంద్‌చంద్ర దర్శకత్వం వహించారు. అనురాగ్‌ కంచర్ల నిర్మాత. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చిత్రంగా జనవరి 1న ప్రేక్షకుల

Updated : 25 Dec 2021 09:31 IST

శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సోనియా ఆకుల, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆశా ఎన్‌కౌంటర్‌’. ఆనంద్‌చంద్ర దర్శకత్వం వహించారు. అనురాగ్‌ కంచర్ల నిర్మాత. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చిత్రంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆశా ఎన్‌కౌంటర్‌ వెనుక కారకులు ఎవరనే విషయాన్ని దర్శకుడు ఆసక్తికరంగా చెప్పారు. ఆనంద్‌ చంద్రకి దర్శకుడిగా మంచి పేరు వస్తుంద’’న్నారు. దర్శకులు మాట్లాడుతూ ‘‘అనేక వాస్తవ కథనాలతో ఈ చిత్రం చేశాం. ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నాం. కానీ పాన్‌ ఇండియా చిత్రాల విడుదల వల్ల ఆలస్యంగా జనవరి 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. వెంకట్‌, శ్రీధర్‌, ముని, నవీన్‌, కల్యాణ్‌, ప్రశాంతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్‌, ఛాయాగ్రహణం: జోషి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని