Bheemla Nayak: డానియల్‌ శేఖర్‌ విచ్చేశాడు..! 

‘బ్లిట్జ్‌ ఆఫ్‌ డానియల్‌ శేఖర్‌’.. పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’.

Updated : 20 Sep 2021 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. టైటిల్‌ పాత్రని పవన్‌ కల్యాణ్‌ పోషిస్తుండగా రానా డానియల్ శేఖర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రానా పాత్రకి సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో రానా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. పంచె ధరించి మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. నేపథ్య సంగీతం విశేషంగా అలరిస్తోంది.‘మీ ఆయన గబ్బర్‌సింగ్‌ అని స్టేషన్‌లో టాక్‌ నడుస్తోంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర.. హీరో’ అంటూ రానా చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్య మేనన్‌, రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని