Rana Daggubati: రానా ‘1945’.. ఆరేళ్లకు విడుదల!  

రానా దగ్గుబాటి నటించిన పీరియాడికల్‌ డ్రామా చిత్రం ‘1945’. సత్యశివ దర్శకుడు. సుమారు ఆరేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం అనివార్య కారణంగా వాయిదాపడుతూ వచ్చింది.

Published : 09 Dec 2021 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా దగ్గుబాటి నటించిన పీరియాడికల్‌ డ్రామా చిత్రం ‘1945’. సత్యశివ దర్శకుడు. ఈ చిత్రం సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాని డిసెంబరు 31న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో రానా పోరాట యోధుడిగా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమాకి మాటలు: ఆకుల శివ, సాహిత్యం: అనంత శ్రీరామ్‌, కూర్పు: గోపికృష్ణ.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని