Balakrishna: తన శ్రీమతికి ఫోన్లో ఐలవ్యూ చెప్పినబాలకృష్ణ

రానా దగ్గుబాటి డిమాండ్‌ మేరకు బాలకృష్ణ తన సతీమణికి ఫోన్లో ప్రపోజ్‌ చేశారు. ‘వసూ.. ఐ లవ్‌ యు’ అని బాలకృష్ణ తన ప్రేమను వ్యక్తం చేయగా ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అంటూ వసుంధర సమాధానమిచ్చారు.

Published : 03 Jan 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా దగ్గుబాటి అడిగిన మేరకు బాలకృష్ణ తన సతీమణికి ఫోన్లో ప్రపోజ్‌ చేశారు. ‘వసూ.. ఐ లవ్‌ యు’ అని బాలకృష్ణ తన ప్రేమను వ్యక్తం చేయగా ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అంటూ వసుంధర సమాధానమిచ్చారు. ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇది. ఈ షోకి రానా అతిథిగా విచ్చేశారు. తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న అనంతరం బాలకృష్ణ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ‘మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్‌ యు అని చెప్పారా’ అని అడగ్గా ‘నీకెందుకయ్యా’ అంటూ బాలకృష్ణ నవ్వులు పంచారు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్‌ చేశారు. పెళ్లి గురించి అడుగుతూ బాలకృష్ణ.. రానాని ఓ ఆట ఆడుకున్నారు. ‘అప్పట్లో పూలరంగడులా తిరిగేవాడివి, నువ్వు ఎంతమందికి హ్యాండ్‌ ఇచ్చావో, ఎంతమందికి నో చెప్పావో గూగుల్‌ చెప్తుంది’ అంటూ వినోదం పంచారు. ఇదే వేదికపై ‘ఏమంటివి ఏమంటివి’ అనే భారీ డైలాగ్‌తో రానా అలరించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని