
Ranbir Kapoor: ‘యానిమల్’ వచ్చేది 2023లో
రణ్‌బీర్‌కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యానిమల్’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కబీర్‌సింగ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి భారీ విజయం అందుకున్న సందీప్ వంగా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.