Rashmi: రష్మి కన్నీటి పర్యంతం.. మానవజాతికి పోయేకాలం!

నటిగా, వ్యాఖ్యాతగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి. ఇక సామాజిక మాధ్యమాల

Published : 04 Oct 2021 01:08 IST

హైదరాబాద్‌: నటిగా, వ్యాఖ్యాతగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి. ఇక సామాజిక మాధ్యమాల వేదికగానూ ఆమె ఎంతో చురుగ్గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటారు. కించపరిచేలా సోషల్‌మీడియాలో ఎవరు మాట్లాడినా అక్కడే ఉతికి ఆరేస్తారు. రష్మి కేవలం నటి మాత్రమే కాదు, జంతు ప్రేమికురాలు కూడా. ‘ఆకలేస్తే నోరు ఉన్న మనుషులు అడుగుతారు. మరి మూగ జీవాలు అడగలేవు కదా’ అంటూ కరోనా సమయంలో ఎన్నో వీధి కుక్కలకు ఆహారం అందించారు. తాజాగా ఓ నెటిజన్‌ పంచుకున్న వీడియోపై విచారం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్‌ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. ‘ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని దివాస్‌లో చిత్రీకరించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు వీధి కుక్కను తాడుతో కట్టి, దాన్ని చావబాదారు. సుమారు 30 నిమిషాల పాటు అలా కొట్టి చంపారు’ అని పేర్కొంటూ ఆ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేశారు.  'ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారన్నమాట. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. మనకు ఈ భూమ్మీద ఉండే అర్హత లేదు’ అంటూ విలపిస్తున్న ఇమోజీని పంచుకున్నారు రష్మి. గతంలోనూ రష్మి వీధి కుక్కల సంరక్షణ, బాగోగుల గురించి ట్విటర్‌ వేదికగా గళమెత్తిన సంగతి తెలిసిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని