Pushpa: ఆ కష్టానికి ఫలితమొచ్చింది

‘నేను నిను చూల్లేదని ఓ... పులుపెక్కి పోతాండవట కదా’ అంటూ ‘పుష్ప’ చిత్ర ట్రైలర్లో రష్మిక చెప్పిన సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక... చిత్తూరు మాండలికాన్ని మాట్లాడటానికి

Updated : 09 Dec 2021 09:30 IST

‘నేను నిను చూల్లేదని ఓ... పులుపెక్కి పోతాండవట కదా’ అంటూ ‘పుష్ప’ చిత్ర ట్రైలర్లో రష్మిక చెప్పిన సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక... చిత్తూరు మాండలికాన్ని మాట్లాడటానికి చాలా కసరత్తులే చేసింది. వాటి గురించి ఇటీవల ఆమె మాట్లాడుతూ... ‘‘చిత్తూరు మాండలికంలోనే ఈ సినిమాలో  సంభాషణలుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. రోజూ మూడు, నాలుగు గంటలు సమయం పట్టేది. మొత్తానికి స్లాంగ్‌ మీద పట్టు వచ్చింది. తొలుత కష్టంగా అనిపించినా...  సినిమాలో దాని ప్రతిఫలం చూశాక... ఆనందంగా ఉంది.’’ అని చెప్పుకొచ్చింది. ఇన్ని రోజులు గ్లామర్‌ పాత్రల్లో మెరిసిన ఈ అమ్మడు ‘పుష్ప’ చిత్రంలో పూర్తి గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ కన్నడ కస్తూరి బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాల్లో నటిస్తోంది.
* ‘పుష్ప’ చిత్రం నుంచి సమంత చేసిన ఐటెం సాంగ్‌ని ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని