PUSHPA: పుష్పరాజ్‌ ప్రేయసి.. శ్రీవల్లిని చూశారా..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో...

Published : 29 Sep 2021 10:15 IST

రష్మిక ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను #SoulmateOfPushpa పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో మెప్పించనున్నారు. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో ఆమె డీగ్లామర్‌ రోల్‌ పోషించినట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. ఫస్ట్‌ సింగిల్‌ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని