Raviteja: అసుర.. ‘రావణాసుర’

ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్‌ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Updated : 06 Nov 2021 14:02 IST

ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్‌ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రవితేజను పదితలల రావణుడిలా చూపించారు. ఆయన లాయర్‌ కోటు ధరించి.. ఓ చేత్తో రక్తంతో తడిసిన సుత్తి పట్టుకుని సీరియస్‌ లుక్‌లో ఉన్నారు. ‘‘హీరోలు అనే వాళ్లు ఉండరు’’ అంటూ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ ‘రావణాసుర’ కథేంటన్నది పూర్తిగా తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ విస్సా కథ అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని