RC 15: రామ్‌చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌..! చెర్రీతో రెండోసారి జోడీ కట్టనున్న బ్యూటీ

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌ ఓ భారీ యాక్షన్‌ అడ్వంచర్‌ సిద్ధం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి....;.

Updated : 23 Nov 2022 11:16 IST

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సిద్ధం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా, నెటిజన్ల ఊహాగానాలకు తెరదించుతూ చిత్రబృందం శనివారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో చెర్రీ సరసన ఆడిపాడనున్నారని తెలియజేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లోకి కియారాకు స్వాగతం చెబుతూ ఓ ఫొటోని షేర్‌ చేసింది.

‘వినయ విధేయ రామా’ అనంతరం చరణ్‌-కియారా కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రమిది. రామ్‌చరణ్‌ 15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేయవచ్చని టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన వెంటనే ఆయన.. శంకర్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే అవకాశాలున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని