RC15: రామ్‌చరణ్‌-శంకర్‌ ఫస్ట్‌ పోస్టర్‌ అదిరింది

టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో సినిమా ప్రారంభమైంది....

Updated : 08 Sep 2021 09:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో సినిమా ప్రారంభమైంది. సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసింది. శంకర్‌, రామ్‌చరణ్‌, కియారా, దిల్‌రాజు, ఇతర నటీనటులందరూ సూటుబూటు వేసుకుని ఫైల్స్‌ చేతబట్టుకుని వస్తున్నట్లు ఈ పిక్‌లో చూపించారు.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోనుంది. ఇందులో చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ సందడి చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. మరోవైపు రామ్‌చరణ్‌.. ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ల ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని