
Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!
హైదరాబాద్: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనలందుకుంది. ఆనంద్ దేవరకొండ నటన చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ అమాయకుడైన స్కూల్ టీచర్ పాత్ర పోషించారు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో గీతాషైనీ, శాన్వి మేఘన, సునీల్, హర్షవర్ధన్, నరేశ్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.