
RRR Trailer: ప్రభంజనం కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి
‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్‌పై చిరు, మహేశ్, సామ్ ఏమన్నారంటే
హైదరాబాద్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి సృష్టించిన అద్భుత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. భారీ యాక్షన్ స్వీక్వెన్స్‌లతో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం ఉదయం విడుదల చేసింది. హైఓల్టేజ్ పోరాట సన్నివేశాలతో, మనసుని హత్తుకునే మాటలతో ప్రతి సీన్ కూడా అదిరేలా సాగిన ఈట్రైలర్‌పై తాజాగా పలువురు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
🎬 ‘‘ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ ఓ బీభత్సం. ఇక, పూర్తి ప్రభంజనం కోసం జనవరి 7 వరకూ ఎదురుచూస్తుంటాను’’ - చిరంజీవి
🎬 ‘‘మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. వీడియోలోని ప్రతి షాట్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మరో అద్భుతమైన చిత్రంతో వచ్చేశారు’’ - మహేశ్‌బాబు
🎬 ‘‘మాటలు రావడం లేదు. (తారక్-పులితో పోరాటం చేస్తోన్న దృశ్యాన్ని షేర్ చేస్తూ..) ఇది 100శాతం నిజమనే భావిస్తున్నాను. తారక్.. నీ కళ్లలో ఉన్న మెరుపుతో నువ్వు ఏదైనా చేయగలవని నిస్సందేహంగా చెప్పగలను. (అల్లూరి సీతారామరాజుగా ఉన్న చరణ్ ఫొటోని పంచుకుంటూ..) చరణ్.. ఆన్‌స్క్రీన్‌లో నేను ఇప్పటివరకూ చూసిన బెస్ట్ ట్రాన్ఫర్మేషన్ ఇదే. అల్లూరి పాత్రలో నువ్వు పూర్తిగా ఒదిగిపోయావు’’ - సమంత