Revanth Reddy: ‘రిపబ్లిక్‌’.. యువత తప్పకుండా చూడాలి : రేవంత్‌ రెడ్డి

‘రిపబ్లిక్‌’ సినిమాని చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Published : 03 Oct 2021 22:24 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్‌’ చిత్రం అద్భుతంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఏఎంబీ థియేటర్స్‌లో ఎమ్మెల్యే సీతక్క, దర్శకుడు దేవా కట్టా, పాప్‌ గాయని స్మితతో కలిసి ‘రిపబ్లిక్’ చిత్రాన్ని చూసిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలపై రూపొందించిన చిత్రం ఆకట్టుకుందన్నారు. యువత తప్పకుండా సినిమాను చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని, ఏ ఉద్దేశంతో అయితే దర్శకుడు ఈ చిత్రాన్ని తీశారో అది నెరవేరుతుందని భావిస్తున్నానన్నారు. కొందరిలో అయినా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని