RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌.. ‘కొమురం భీముడా’ సాంగ్‌ వచ్చేసింది!

పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సినీ ప్రియులకు మరో కానుక అందింది. ‘రివోల్ట్‌ ఆఫ్‌ భీమ్‌’ అనే గీతం శుక్రవారం విడుదలైంది.

Updated : 25 Dec 2021 09:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సినీ ప్రియులకు మరో కానుక అందింది. ‘రివోల్ట్‌ ఆఫ్‌ భీమ్‌’ అనే గీతం శుక్రవారం విడుదలైంది. ఈ ఉద్వేగభరిత గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చగా, సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని