MAA Elections: ‘మా’పై రాంగోపాల్‌ వర్మ సెటైర్‌

సినిమా రిలీజ్‌లు.. బాక్సాఫీస్‌ రికార్డులు.. హీరోహీరోయిన్స్‌లపై గాసిప్స్‌.. ఇలా రకరకాల టాపిక్స్‌ వల్ల ఇంతకుముందు వరకూ సినిమా పరిశ్రమ గురించి అందరూ...

Updated : 17 Oct 2021 10:55 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’లో సమస్యలున్నాయంటూ ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేసినప్పటి నుంచి ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ నటీనటుల మధ్య జరిగిన మాటల దాడులు సాధారణ రాజకీయాలను తలపించిన విషయం తెలిసిందే. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే అంశం నుంచి ప్రారంభమై.. వ్యక్తిగత ఆరోపణలు, సినిమా బడ్జెట్లు, అవార్డులంటూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు, శనివారం జరిగిన అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలోనూ పలువురు నటులు ప్రత్యర్థి ప్యానెల్‌, వారి మద్దతుదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, ‘మా’లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని