Updated : 03/10/2021 06:59 IST

Rhea Chakraborty: వారానికి రూ.35 లక్షలు ఇస్తానన్నా.. ఆఫర్‌ వద్దనుకున్న రియా చక్రవర్తి

ముంబయి‌: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు నటి రియా చక్రవర్తి. సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌లో నెమ్మదించిన ఆమెకు ఓ భారీ ఆఫర్‌ వచ్చినట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆఫర్‌ ఏమిటంటే.. ‘బిగ్‌బాస్‌’. బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ -15’. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనేందుకు రియా చక్రవర్తికి ఆఫర్‌ వచ్చిందట. ఒకవేళ ఆమె ఓకే అంటే ఇప్పటివరకూ ఏ కంటెస్టెంట్‌కి ఇవ్వనంతగా వారానికి రూ.35 లక్షలు పారితోషికంగా చెల్లిస్తామని టీమ్‌ తెలిపిందని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై స్పందించిన రియా టీమ్‌.. రియాకు బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమేనని.. కాకపోతే ఆమె ఫోకస్ అంతా ప్రస్తుతం సినీమాలపై ఉందని..అందుకే ఆ ఆఫర్‌ని సున్నితంగా వద్దనుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా, పలు ప్రాజెక్ట్‌ల విషయమై ఆమె త్వరలోనే బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు దర్శకనిర్మాతలను కలవనున్నారని ఆమె టీమ్‌ వెల్లడించింది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని