Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం వాడే

నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. మిక్కీ జే మేయర్‌ స్వరాలందించారు. ఈ సినిమా...

Updated : 07 Nov 2021 06:54 IST

నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. మిక్కీ జే మేయర్‌ స్వరాలందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్రం నుంచి ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’ గీతాన్ని విడుదల చేశారు. ‘‘శ్యామ్‌ సింగరాయ్‌.. అరె ఎగసి  ఎగసి పడు అలజడి వాడే.. అరె తిరబడిన సంగ్రామం వాడే’’ అంటూ శ్యామ్‌ పాత్రను, అతని తత్వాన్ని వివరిస్తూ పాట ఆకట్టుకునేలా సాగింది. దీనికి కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా.. విశాల్‌ దద్లానీ, అనురాగ్‌ కులకర్ణి సంయుక్తంగా ఆలపించారు. లిరికల్‌ వీడియోలో నాని బెంగాలీ యువకుడిలా సరికొత్తగా కనిపించారు. సాయి పల్లవి ఆయన భార్యగా కనిపించింది. ‘‘విభిన్నమైన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. నాని దీంట్లో శ్యామ్‌ సింగరాయ్‌గా, వాసుగా రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. నిర్మాణాంతర పనులు తుది దశలో ఉన్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలియజేశాయి. కథ: సత్యదేవ్‌ జంగా, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని