Romantic: ఓటీటీలో ‘రొమాంటిక్‌’.. ‘ఆహా’ అనిపించే ట్రైలర్‌ చూశారా!

‘రొమాంటిక్‌’ ఆహా కట్‌ ట్రైలర్‌. ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ నటించిన చిత్రం నవంబరు 26న ఓటీటీలోకి రాబోతుంది.

Published : 22 Nov 2021 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌’. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న థియేటర్లలో విడుదలై యువతను అమితంగా ఆకర్షించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా ‘ఆహా కట్‌’ పేరుతో ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఉత్తేజ్‌, రమాప్రభ, దేవయాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్‌పై ఓ లుక్కేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని