Romantic: ఓటీటీలోకి ‘రొమాంటిక్‌’.. అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌’. కేతిక శర్మ కథానాయిక.

Updated : 30 Aug 2022 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌’. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న థియేటర్లలో విడుదలై యువతను అమితంగా ఆకర్షించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఉత్తేజ్‌, రమాప్రభ, దేవయాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.

క‌థేంటంటే..

వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఓ అనాథ‌. త‌న లాంటి అనాథ‌ల కోసం ఇళ్లు క‌ట్టించాల‌ని చిన్న‌ప్పుడే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. డ‌బ్బు సంపాద‌న కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడ‌తాడు. గోవాలో డ్రగ్స్ స్మ‌గ్లింగ్ విష‌యంలో రెండు ముఠాల మ‌ధ్య అధిప‌త్య పోరు న‌డుస్తుంటుంది. వాస్కోడిగామా ఓ ముఠాలో చేరి.. అన‌తి కాలంలోనే ఆ ముఠా నాయ‌కుడిగా ఎదుగుతాడు. ఇదే స‌మ‌యంలో గోవా పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార‌తాడు. అయితే అత‌ని జోరును ఆప‌డానికి ఏసీపీ ర‌మ్య గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌)ను రంగంలోకి దించుతుంది ప్ర‌భుత్వం. వాస్కోని, అత‌ని గ్యాంగ్‌ను అంతం చేయ‌డ‌మే ఆమె లక్ష్యం. గోవార్క‌ర్ రంగంలోకి దిగాక‌.. వాస్కో ల‌క్ష్య సాధ‌న‌కు అనేక స‌వాళ్లెదుర‌వుతాయి. ఈ క్ర‌మంలోనే మౌనిక (కేతిక శ‌ర్మ‌)తో వాస్కో సాగిస్తున్న‌ రొమాంటిక్ ప్ర‌యాణంలోనూ ఇబ్బందులెదుర‌వుతాయి. మ‌రి వాటిని వాస్కోడిగామా ఎలా ఎదుర్కొన్నాడు? ఏసీపీ ర‌మ్య‌కు వాస్కో చిక్కాడా?మౌనిక‌తో అత‌నికున్న సంబంధం ఏంటి? అది ప్రేమా? లేక త‌ను న‌మ్మే మోహ‌మా? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని