Rowdy Boys: ‘రౌడీ బాయ్స్‌’.. సందడి మొదలైంది!

‘రౌడీ బాయ్స్‌’ టైటిల్‌ గీతం విడుదలైంది. ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రమిది.

Updated : 07 Dec 2022 20:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడు ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘హుషారు’ ఫేం హర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. విశాఖపట్నంలోని విజ్ఞాన్‌ కళాశాల ఈ వేడుకకి వేదికైంది. ఈ హుషారైన గీతాన్ని ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడా రచించి, ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. కథానాయకుడి లుక్స్‌, డ్యాన్సు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథ ఇది. ప్రేమ, యాక్షన్‌, డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆశిష్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ అలరించనుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని