RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌.. మాంచి కిక్కిచ్చిన జక్కన్న

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం..

Updated : 01 Nov 2021 11:24 IST

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌’ (RRR Glimpse) పేరుతో 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్‌ (RamCharan).. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ (Tarak).. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ (Aliabhatt) ఈసినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని