RRR: అదిరిపోయే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థీమ్‌ సాంగ్‌.. గాయకులు వీరే

 యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

Updated : 27 Jul 2021 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌’ పేరిట ప్రత్యేక గీతాన్ని రూపొందించారనే సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచే ఎవరు పాడుతున్నారా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. తాజాగా చిత్రబృందం ఈ వివరాల్ని తెలియజేస్తూ ఫొటోను విడుదల చేసింది. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించిన ఈ పాట ఆగస్టు 1న విడుదల కానుంది. స్నేహం విలువని చాటిచెప్పే గీతమిది.

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని పలువురు హాలీవుడ్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని