Published : 12 Nov 2021 12:13 IST

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మాస్ సాంగ్‌.. ‘నాటు’ స్టెప్పులు నేర్చుకోండిలా!

ఇంటర్నెట్‌ డెస్క్: హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, సెలూన్స్‌.. ఇలా ఎక్కడా విన్నా.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా ఎందులో చూసినా ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటే రిపీట్‌ అవుతోంది. సంగీతానికి తోడు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల డ్యాన్స్‌ మేనియా అలాంటిది మరి! ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని గీతమిది. నవంబరు 10న విడుదలైంది. అతి తక్కువ సమయంలోనే రికార్డు సృష్టించింది. చరణ్‌, తారక్‌ కలిసి ‘నాటు నాటు’ అనే బీట్‌కి అదిరిపోయే స్టెప్పులేసి యావత్‌ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. తమ వేగంతో అందరినీ ఆశ్చర్యపర్చారు. కొందరు అభిమానులు వీరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మరికొందరికి డ్యాన్స్‌ చేయాలని ఉన్నా కాలు ఎలా కదపాలో తెలియక ఆగిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే యూట్యూబ్‌ వేదికగా కొందరు పాఠాలు నేర్పుతున్నారు. ‘నాటు నాటు హుక్‌ స్టెప్‌ ట్యుటోరియల్‌’ పేరుతో వీడియోలు రూపొందించి వావ్‌ అనిపిస్తున్నారు. మీకూ ఈ ‘నాటు’ స్టెప్పు వేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలు చూసి నేర్చుకోండి...

Read latest Cinema News and Telugu News



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని