RRR: ముందు రోజు ప్రీమియర్ షో.. రాజమౌళి ఏమన్నారంటే?
కెమెరాల ముందు కనిపించడం కోసం పైపైకి నటిస్తూ జీవించడం తమకి ఇష్టం లేదని నటుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. తాజాగా ఆయన ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్మీట్లో పాల్గొని విలేకర్లు అడిగి...
నటిస్తూ జీవించడం మాకు నచ్చదు : రామ్‌చరణ్, ఎన్టీఆర్
హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్, తారక్, ఆలియాభట్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
తారక్-చరణ్‌లను మొదటిసారి ఒకే ఫ్రేమ్‌లో చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది?
రాజమౌళి: తారక్-చరణ్‌లిద్దరూ ఒకే బైక్‌పై వస్తోన్న షాట్‌ని మొదట షూట్ చేశాను. వాళ్ల మాటలు, ప్రవర్తన చూసిన వెంటనే నేను ఫిక్స్ అయ్యాను. తప్పకుండా ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌లో వర్కౌట్ అవుతుందని.
వివిధ భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందిపడ్డారా?
తారక్: తెలుగు, కన్నడ, హిందీ, తమిళంలోనే నేను డబ్బింగ్ చెప్పాను. మలయాళంలో చెప్పలేదు. చెప్పడానికి ప్రయత్నించాను. కాకపోతే ఆ భాషను ఖూనీ చేస్తున్నట్లు అనిపించింది. దాంతో మా జక్కన్న వద్దని చెప్పడంతో దాన్ని అక్కడి నటులతో చెప్పించాం. నిజం చెప్పాలంటే డబ్బింగ్ విషయంలో ఎక్కడా కష్టం అనిపించలేదు. జక్కన్న ఆవిధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే, కొన్ని భాషలకు ట్రైనర్లను ఏర్పాటు చేశారు.
ఈ సినిమా పది భాషల్లో రిలీజ్ అవుతుందని విన్నాం? అందులో నిజమెంత?
రాజమౌళి: ఐదు భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అవుతోంది. అదే సమయంలో వేరే భాషల్లో డబ్ చేస్తున్నారు. ఆయా భాషలకు సంబంధించిన నటీనటులు డబ్బింగ్ చెబుతున్నారు.
కరోనా సమయంలోనూ షూట్‌కి వెళ్లారు కదా. మీ ఫీలింగ్ ఏమిటి?
ఆలియా: ట్రైలర్ అదిరిపోయింది కదా (నవ్వులు). ముంబయిలో మాకు పిచ్చెక్కిస్తోంది. రాజమౌళి సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరడంతో కరోనా సమయంలోనూ షూటింగ్‌కు వెళ్లాను. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ టీమ్ మొత్తం కష్టపడి పనిచేయడం చూసి నేనెంతో స్ఫూర్తి పొందాను.
రామ్‌చరణ్: కరోనాకు ముందు ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కరోనా సమయంలో ఒకరకంగా డీలా పడ్డాం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మేము మరింత జోష్‌తో లాక్డౌన్ అనంతరం తిరిగి సెట్లోకి వచ్చాం.
తారక్: ప్రతి జీవికి ఓ ఆశ ఉంటుంది. అదే అతడిని నడిపిస్తోంది. అదే మాదిరిగా రాజమౌళి కన్న కలని సాకారం చేయడంలో మేము భాగం కావాలనే జోష్‌తోనే వర్క్ చేశాం.
రాజమౌళి: కరోనా మనకి ఒక్కరికే కాదు.. ప్రపంచం మొత్తానికి వచ్చిన ప్రమాదం. ప్రాణనష్టం వల్ల ఎంతో భయపడ్డాను. ‘ఇప్పటివరకూ పరిగెత్తింది చాలు.. కాస్త నెమ్మదించు’ అని ప్రకృతి మనందరికీ చెప్పినట్లు ఉంది. కరోనా కారణంగా అందరం కలిసి ఇంట్లోనే ఉండటం బాగుంది. కుటుంబంతో ఎంజాయ్ చేశాను. రెట్టించిన ఉత్సాహంతో షూట్ ప్రారంభించాం. కంప్లీట్ చేశాం.
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా వల్ల మీరు మానసిక సంఘర్షణకు గురయ్యారా?
రాజమౌళి: కరోనాతో జరిగిన ప్రాణనష్టం వల్ల బాధపడ్డా. కానీ కరోనా సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేశా. ఏవైనా ఇబ్బందులు వచ్చి మన ఒక్క సినిమానే ఆగిపోతే భయపడతాం. కానీ అన్ని సినిమాలు ఆగిపోయాయి. ప్రపంచం ఆగిపోయింది. ఇది ఒక పాజ్ మాత్రమే.. స్టాప్ కాదు.
‘యుద్ధం మొదలైతే ఆయుధాలు దానంతటవే వస్తాయన్నారు’. మరి, ఈసినిమాలో చరణ్-తారక్ వంటి ఆయుధాలను ఉపయోగించారు. ప్రేక్షకుల్ని ఎలా మెప్పించనున్నారు?
రాజమౌళి: ట్రైలర్లో సినిమా మొత్తాన్ని చూపించలేం కదా. సినిమాలో ఇంకా చాలా ఆయుధాలుంటాయి.
టైగర్ని నిజంగానే భయపెట్టారా?
తారక్: ఆ సీన్లో కనిపించని పులి మా జక్కన్న. పరిచయస్థుడైన పులి కాబట్టే నేను కూడా ఒక అరుపు అరిచాను. (నవ్వులు)
కొమురంభీమ్ కోసం మీరు ఏవిధంగా శ్రమించారు?
తారక్: ఆయన పాత్రలోకి లీనం కావడం కోసం ఎంతో శ్రమించాను. స్వతహాగా మనం తెలుగువారం కాబట్టి కొమురంభీమ్ గురించి కొంతవరకూ తెలుస్తుంది. కానీ.. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? మెంటల్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.. ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక పూర్తిస్థాయి విజన్ ఉంది. అన్ని విషయాల్లో ఆయనే నాకు సాయం చేశారు. ప్రతి సినిమాకీ నటుడిగా శ్రమిస్తుంటాను. కానీ ఈ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువగా శ్రమించాను.
‘ఆర్ఆర్ఆర్’లో మీకు నచ్చిన.. నటుడిగా మీరు పూర్తిస్థాయిలో నటించిన సీన్ ఏది?
తారక్: ఒక్క సీన్ అంటే చెప్పలేం. ‘ఆర్ఆర్ఆర్’ అనేది ఒక కమిట్మెంట్. నటులుగా మేము ఆయనకు ఇచ్చిన కమిట్మెంట్. నిజం చెప్పాలంటే.. కరోనాలోనూ మాకు ‘ఆర్ఆర్ఆర్’ గురించే ఆలోచన.
రామ్‌చరణ్: రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఆయన చెప్పినదాన్ని మేము 100 శాతం చేశాం.
వేరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ‘ఆర్ఆర్ఆర్’ సరిపోతుందని భావించే ఈ చిత్రాన్ని ఓకే చేశారా?
తారక్: రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన సినిమాలో నటించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కథ ఓకే చేశా. అప్పుడు నాకు తెలీదు ఇది పాన్ ఇండియా మూవీ అని. షూటింగ్ ప్రారంభించాక.. ఓరోజు ఆయన మా ఇద్దరికీ ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత డబ్బింగ్ మీరే చెప్పాలన్నాడు.
బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబర్చరు అని అంటుంటారు అందులో నిజమెంత?
ఆలియా: ఆ మాటలు నిజమనుకోవడం లేదు. సౌత్ సినిమా.. ముఖ్యంగా జక్కన్న సినిమాలో చేయాలనేది నా లైఫ్‌టైమ్ డ్రీమ్. చాలామంది తారలు సైతం అలాగే అనుకుంటున్నారు. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్ తారలు కూడా ఇక్కడ నటిస్తారు.
చరణ్-తారక్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది?
ఆలియా: వాళ్లిద్దరూ మంచి నటులు. వాళ్లతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది. ఎన్నో నేర్చుకున్నాను. నాకు మంచి భోజనం రుచి చూపించారు. మరోసారి ఛాన్స్ వస్తే తప్పకుండా రాజమౌళి సర్‌తో వర్క్ చేయాలని ఉంది. (అనంతరం రణ్‌బీర్‌ని ఉద్దేశిస్తూ మీ జీవితంలో ‘ఆర్’ అనే లెటర్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది కదా. దానిపై స్పందించాలని విలేకరి కోరగా.. ‘ఐ లవ్ ఆర్ఆర్ఆర్’ అని ఆలియా సమాధానం ఇచ్చింది)
రాజమౌళి: చరణ్-తారక్ సెట్లో ఎలా ఉంటారో చెప్పు?
ఆలియా: నా ఫస్ట్ డే షూట్ తారక్‌తో జరిగింది. తారక్ నన్ను చూసిన వెంటనే.. ‘‘కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చరణ్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్ లేదు’’ అని చెప్పారు. ఆ తర్వాత రోజు చరణ్‌తో షూట్.. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ, వాళ్లిద్దరూ ఒక చోట కలిస్తే పక్కన ఎవరు ఉన్నారనేది పట్టించుకోరు. తారక్.. చరణ్‌ని సరదాగా ఆటపట్టిస్తుంటారు.
మీకు తెలుగు ఎవరు నేర్పించారు?
ఆలియా: ‘ఆర్ఆర్ఆర్’ ఓకే చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు అక్షయ్ అనే వ్యక్తి దగ్గర తెలుగులో ట్రైనింగ్ తీసుకున్నా. ఒక ఏడాదంతా జూమ్ కాల్‌లోనే తెలుగు నేర్చుకున్నా.
ఆలియాని మొదటిసారి సెట్లో చూశాక మీ ఫీలింగ్ ఏమిటి?
రామ్‌చరణ్: తారక్ చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్‌డే షూట్ అతనితోనే
తారక్: నీకు జంట కదా. కాబట్టి నువ్వు చెబితేనే బాగుంటుంది (నవ్వులు)
రామ్‌చరణ్: తారక్ కంగారు పడ్డాడు. చాలా రోజుల తర్వాత హీరోయిన్‌తో వర్క్ చేస్తున్నందుకు. నేను అల్లూరి సీతారామరాజుగా ఆ క్యారెక్టర్లో లీనమైపోయాను. కాబట్టి ఆమెతో ఎక్కువ సరదాగా మాట్లాడలేదు. ఆలియా మంచి నటి అని అందరికీ తెలుసు. ఆమె స్థాయికి సరిపోయేలా నటించాలని అనుకున్నా.
తారక్: నేను ఎంతో ఇబ్బందిపడ్డాను. ఆమె నటనకు నేను సెట్ కాగలనా? అని కంగారుపడ్డా.
ఆలియా: వాళ్లిద్దరికీ నేను బిర్యానీ ఇప్పించాను. అందుకే ఇద్దరూ నా గురించి చక్కగా మాట్లాడతారు (నవ్వులు)
సీన్స్‌ని తీర్చిదిద్దే సమయంలో మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది?
రాజమౌళి: సీన్స్ విషయంలో నాకు ఎన్నో ఎలివేషన్స్ ఉంటాయి. మైండ్‌లో ఎప్పుడూ అవి రన్ అవుతూనే ఉంటాయి. మనసులో అనుకున్న దాన్ని స్క్రీన్‌పై తీసుకురావడానికి ఎంతో భయపడతాను. నా నటీనటుల్ని, టెక్నిషియన్స్‌ని టార్చర్ పెడతాను. కథకు తగ్గట్టు మంచి నటీనటులు దొరకడం నా అదృష్టం.
మీ సినిమాల విషయంలో పుస్తకాలు ఎలా ఉపయోగపడ్డాయి?
రాజమౌళి: అమరచిత్ర కథలు చిన్నప్పుడు బాగా చదివాను. యండమూరి, యద్ధనపూడి సులోచనా రాణి పుస్తకాలు, వారపత్రికలు.. ఇలా చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. నాలో ఉన్న సృజనకి నేను చదివిన పుస్తకాలే కారణం.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే మీరు రెండు విభిన్నమైన పాత్రలు పోషించినట్లు కనిపిస్తుంది?
రామ్‌చరణ్: ఇందులో నేను మొత్తం మూడు షేడ్స్‌లో కనిపిస్తాను. మూడూ విభిన్నంగానే ఉంటాయి.
ముందు రోజు ప్రీమియర్ వేసే అవకాశం ఉందా?
రాజమౌళి: నేను ఇంకా ఆలోచించలేదు. డిస్టిబ్యూటర్స్‌తో మాట్లాడి.. నిర్మాత ఓకే అంటే తప్పకుండా ప్రీమియర్ వేస్తాం.
ఇది ఫిక్షనలా? హిస్టరీనా?
రాజమౌళి: ఇది మొత్తం కల్పితమే. చరిత్రకు సంబంధించిన సంఘటనలు, విషయాలు ఇందులో లేవు.
ఈ సినిమాలో పునర్జన్మల ప్రస్తావన ఏమైనా ఉంటుందా?
రాజమౌళి: లేవు
కొమురంభీమ్ కథ కోసం ఆయన నివసించిన ప్రాంతానికి వెళ్లారా? వాళ్ల కుటుంబీకులను కలిశారా?
రాజమౌళి: నేను ఆయన బయోపిక్ చేస్తే తప్పకుండా కథ గురించి తెలుసుకోవడానికి మీరు చెప్పిన ప్రాంతానికి వెళ్లాలి. కానీ, ‘ఆర్ఆర్ఆర్’లో ఆ యాంగిల్స్ ఏమీ టచ్ చేయడం లేదు. ఇందులో 95 శాతం సినిమా దిల్లీ చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో గోండు సామ్రాజ్యం ఉండేది. నిజాం పరిపాలన వల్ల వాళ్ల వర్గం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి వర్గానికి చెందిన ఓ వ్యక్తి నగరానికి వస్తే.. అనే ఆలోచన ఈ సినిమాలో చూపించాను. అదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు ఒక జన ప్రపంచంలోకి వస్తే.. ఆయన ఎలా ప్రవర్తిస్తాడు. దానిపై వర్క్ చేశాం. వ్యక్తిత్వాల మీద, పాత్రలు మీద మాత్రమే ఈ సినిమాని చూపించాం.
కొమురం భీమ్ ఒక మతానికి చెందిన టోపీ పెట్టుకున్నట్లు చూపించారు కదా? సినిమా మొత్తం అలాగే ఉంటారా?
రాజమౌళి: కొన్నిరోజులు వెయిట్ చేయండి. సినిమా రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది. ట్రైలర్లో ఇంత కథ ఎవరైనా చెబుతారా? మీరు అడిగేది ఎలా ఉందంటే.. స్క్రిప్ట్ బుక్ మొత్తం ఇప్పుడే అడిగేస్తున్నట్లు ఉంది.(నవ్వులు)
హీరోలిద్దరికీ ఓకే విధంగా బ్యాలెన్స్ చేసి చూపించకపోతే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తాయి?
రాజమౌళి: సినిమా ప్రారంభమయ్యాక.. తారక్-చరణ్‌ని చూసి ఫ్యాన్స్ ఇలాంటి చాలా విషయాలు మర్చిపోతారు.
ఇది దేశభక్తి చిత్రమా?
రాజమౌళి: ఇది దేశభక్తి సినిమా కాదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ మీద తీసిన సినిమా. కాకపోతే అంతర్లీనంగా దేశభక్తి కూడా ఉంటుంది.
టైటిల్ పోస్టర్లో రామ్‌చరణ్ ముందు ఉంటారు. తారక్ తర్వాత ఉంటారు? దాని ఉద్దేశం భీమ్ కంటే అల్లూరి పెద్దవాడనా?
రాజమౌళి: మేము అంతలా ఆలోచించి పెట్టలేదు. నిజం చెప్పాలంటే చెర్రీ కంటే తారకే ఒక ఏడాది పెద్ద
తారక్: నా వయసు గురించి అడిగారా (నవ్వులు)
కథ ఎలా ప్రారంభమైంది?
రాజమౌళి: ఓ రోజు తారక్, చరణ్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. ముందు తారక్ వచ్చాడు. సోఫాలో కూర్చొని నాతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి చరణ్ వచ్చాడు. తారక్‌ని చూసి చరణ్ షాకయ్యాడు. చరణ్‌ను చూసి తారక్ కూడా అంతే. ఏంటి జక్కన్న ఇద్దర్నీ పిలిచావు అని ఇద్దరూ అడిగారు. మీ ఇద్దరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నా.. అని చెప్పడంతో వాళ్లిద్దరూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేను మర్చిపోలేను. కానీ, వాళ్లిద్దరూ ఫుల్ హ్యాపీ. అప్పుడే మీకు ఫస్ట్ మా ముగ్గురి ఫొటో షేర్ చేశాం.
అల్లూరి, కొమురం భీమ్ పాత్రలు కదా.. ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?
రాజమౌళి: రెండు ఆటంబాంబులు నాకు దొరికినట్లు ఫీల్ అయ్యా. అల్లూరి, కొమురం పేర్లతో ఉన్న ఇద్దరు హీరోలు ‘నాటు నాటు’ సాంగ్‌కి స్టెప్పులేయడం ఏంటి? అనే కామెంట్లు వస్తాయని ముందే ఊహించాం. ఆ పాటలో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అది మీరు సినిమాలో చూస్తారు. దానికి కూడా మీరు కనెక్ట్ అవుతారు.
ఇందులో రొమాన్స్ చూపించడానికి ఆస్కారం ఉంటుందా?
రాజమౌళి: రొమాన్స్ కాదు బ్రొమాన్స్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
ట్రైలర్ ముందు రిలీజ్ చేయడానికి కారణమేమిటి?
రాజమౌళి: యూట్యూబ్‌లో ట్రైలర్ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయాలనుకున్నాం. కాకపోతే ట్రైలర్ థియేటర్లో రిలీజ్ అయ్యాక.. దాన్ని అభిమానులు షూట్ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేయడం చూశాక.. భయపడి.. 11 గంటలకే రిలీజ్ చేశాం.
మీ ఇద్దరు స్నేహితులు కదా? ఈ సినిమాకు ఎలా ఉపయోగపడింది?
రామ్‌చరణ్: సినిమా వల్ల మేమిద్దరం స్నేహితులం కాలేదు. మేమిద్దరం ముందు నుంచే మంచి స్నేహితులం. దాన్ని ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌పై చూపించాం. నిజం చెప్పాలంటే.. గాసిప్స్, విభేదాలు ఏమైనా మా మధ్య వచ్చినా కూడా.. అనుబంధం ఎంత గట్టిగా ఉంది అనేదే మేము చూసుకుంటాం. అందుకే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఒక వేళ భవిష్యత్తులో ఏమైనా గొడవలు వస్తే తప్పకుండా విడిపోయి విడివిడిగా ఉంటాం. ఎందుకంటే బయటవాళ్ల కోసం నటిస్తూ స్నేహితులుగా ఉండటం మా ఇద్దరికీ నచ్చదు.
తారక్: మా ఇద్దరి ఇళ్లూ పక్క పక్కనే ఉంటాయి. దాంతో మేమిద్దరం తరచూ కలుస్తూనే ఉంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్