PUSHPA: పుష్పరాజ్, శ్రీవల్లి జోడీగా వస్తే.. ఈల వేయాల్సిందే..!

మునుపెన్నడూ లేనివిధంగా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఊరమాస్‌, రఫ్‌లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ...

Published : 28 Oct 2021 11:23 IST

హైదరాబాద్‌: మునుపెన్నడూ లేనివిధంగా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) రఫ్‌లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక(Rashmika) నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ మాస్‌ ట్రీట్‌ బయటకు వచ్చింది. ఈ మేరకు ‘పుష్ప’లోని మూడో పాట ‘సామీ నా సామీ’(Saami Saami) లిరికల్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం సోషల్‌ మీడియాలో పంచుకొంది. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ అలపించారు. 

పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’(Pushpa The Rise) పేరుతో తొలి భాగాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని