Sonu Sood: సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ప్రేమ గీతం

సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ఓ హిందీ గీతం రూపొందుతోంది. ఫరాఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్షుల్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు.

Published : 05 Aug 2021 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ఓ హిందీ గీతం రూపొందుతోంది. ఫరాఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్షుల్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. సోనూ, నిధి లుక్స్‌, హావభావాలు, లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘సాత్‌ క్యా’ అంటూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో టోనీ కక్కడ్‌ రచించారు. అల్తాఫ్‌ రాజ్‌తో కలసి టోనీ కక్కడ్‌ ఆలపించారు. ఫరాఖాన్‌ కొరియోగ్రఫీ సమకూర్చారు. పూర్తి వీడియో ఆగస్టు 9న విడుదల కానుంది. ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘మై హూనా’ తదితర చిత్రాల దర్శకురాలే ఫరాఖాన్‌. కొరియోగ్రాఫర్, నటి, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు