Tollywood: సాయికుమార్‌ ఇంట చిరు సందడి

నటుడు, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ఇంట జరిగిన ఓ సాంప్రదాయ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. సాయికుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సాయికుమార్‌ 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబసభ్యుల...

Published : 26 Jul 2021 14:21 IST

హైదరాబాద్‌: నటుడు, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ఇంట జరిగిన వేడుకలో అగ్ర కథానాయకుడు చిరంజీవి సందడి చేశారు. సాయికుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సాయికుమార్‌ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబసభ్యుల సమక్షంలో తన భార్య సురేఖతో ఆయన షష్ఠిపూర్తి వేడుకలు జరుపుకొన్నారు. ఎంతో ఘనంగా సాగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా చిరు, వెంకటేశ్‌, రాజశేఖర్‌-జీవిత వంటి టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. సాయికుమార్‌ దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం సాయి ఫ్యామిలీతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు సాయి ప్రస్తుతం వెండితెర, బుల్లితెర వేదికలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. రానున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి సాయికుమార్‌ పోటీలోకి దిగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని