
Sai Dharam Tej: ‘రిపబ్లిక్’ చిత్రాన్ని మీతో కలిసి చూడలేకపోయా..
ఇంటర్నెట్ డెస్క్: తన అభిమానులకు, ప్రేక్షకులకు యువ నటుడు సాయిధరమ్ తేజ్ ఓ సందేశమిచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆడియో మెసేజ్‌ను పంచుకున్నారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను నటించిన ‘రిపబ్లిక్’ చిత్రాన్ని మీతో కలిసి చూడలేకపోయా. ఈ సినిమా ఓటీటీ ‘జీ 5’ వేదికగా నవంబరు 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తప్పకుండా చూడండి. సినిమాపై మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి’ అని కోరారు. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు దేవ్‌కట్టా తెరకెక్కించిన చిత్రమిది. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన సమయంలో (అక్టోబరు 1) ఈ సినిమా విడుదలైంది. దాంతో ఆయన ఈ సినిమాని అభిమానులతో కలిసి చూడలేకపోయారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతున్న నేపథ్యంలో ఇలా స్పందించారు. ఈ చిత్రంలో ఆయన కలెక్టరుగా కనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో పోషించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది.
► Read latest Cinema News and Telugu News