Saipallavi: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి

పవర్‌ఫుల్‌ కథాంశంతో సూపర్ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం....

Published : 20 Dec 2021 01:05 IST

ఆమె భావోద్వేగానికి కారణమేమిటంటే

హైదరాబాద్‌: పవర్‌ఫుల్‌ కథాంశంతో సూపర్ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అభిమానుల సమక్షంలో ‘శ్యామ్‌సింగరాయ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఆమె కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకులూ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఈరోజు మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నాను. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా భావోద్వేగంతో మాటలు రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఇండస్ట్రీకి.. నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న దర్శకులందరికీ నా కృతజ్ఞతలు. నేనెంతో శ్రమించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అందరూ అంటుంటారు. నిజం చెప్పాలంటే నేను ఏ సినిమాని కష్టంగా భావించి పని చేయలేదు. ఇష్టపడి.. ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాను. నేషనల్‌ అవార్డు అందుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటానని అనుకున్నాను. కానీ, ఒక నటిగా ఈ స్టేజ్‌పై ఉండటమే ఓ పెద్ద అవార్డని ఈరోజు అర్థమైంది. అందుకే నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్‌’’ అంటూ సాయిపల్లవి ఎమోషనల్‌ అయ్యారు. నాని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

అనంతరం దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో ఉన్న గొప్ప నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. రాబోయే తరాల నటీమణులకు ఆమె ఒక లెజెండ్‌ అవుతారు. సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ అమితమైంది. ఇందులో, ఆమె రోల్‌ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. క్లాసిక్‌ డ్యాన్సింగ్‌ ఉదయం మొత్తం ప్రాక్టీస్‌ చేసి.. రాత్రి పూట భోజనం కూడా చేయకుండా తెల్లవారుజాము వరకూ షూట్‌లో పాల్గొనేవారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన.. మరోస్థాయిలో ఉంటుంది. ఆ మేజిక్‌ని 24తేదీన థియేటర్‌లో చూసేందుకు మీతోపాటు నేనూ సిద్ధంగా ఉన్నా. ఆమెతో మరెన్నో సినిమాలు చేయాలని భావిస్తున్నా’’ అని రాహుల్‌ తెలిపారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని