Salman Khan:సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సల్మాన్‌ఖాన్
తాను నటించిన సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు సల్మాన్‌ఖాన్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అత్యుత్తమ చిత్రాల్లో ‘బజరంగీ భాయిజాన్’ ఒకటి. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం అందరి హృదయాల్ని హత్తుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ భావోద్వేగ సినిమాకి సంబంధించి సల్మాన్ ఓ శుభవార్త వినిపించారు. ఈ సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ తీసుకొస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ‘బజరంగీ..’కి కథ అందించిన విజయేంద్ర ప్రసాదే (దర్శకుడు రాజమౌళి తండ్రి) కొనసాగింపు చిత్రానికీ కథ అందిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ‘బజరంగీ..’ 2015 జులై 17న విడుదలైంది. పాకిస్థాన్‌కు చెందిన మూగ, చెవిటి చిన్నారిని తన కన్నవారి వద్దకు చేర్చేందుకు భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి