
Updated : 01 Dec 2021 20:09 IST
Salman Khan: హైదరాబాద్ రాగానే బిరియానీ రుచి చూశా: సల్మాన్ ఖాన్
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. ‘అంతిమ్’ ప్రచారం కోసం నగరంలోని ఓ మాల్‌కు విచ్చేసిన సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై నటిస్తూ నిర్మించిన చిత్రం ‘అంతిమ్’. ఆయుశ్ శర్మ ముఖ్య పాత్రధారి. మహేశ్ ముంజ్రేకర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 26న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...‘‘హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రదేశం. హైదరాబాద్ రాగానే బిరియానీ రుచి చూశా. ‘అంతిమ్’ అందరినీ మెప్పిస్తోంది. మళ్లీ వచ్చినప్పుడు కచ్చితంగా అభిమానులను కలుస్తా’’ అని సల్మాన్ చెప్పాడు.
Tags :