Salmankhan: సల్మాన్‌ వ్యాఖ్యాతగా ఐఫా వేడుక

వచ్చే ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 22వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్‌ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది

Updated : 15 Dec 2021 06:55 IST

చ్చే ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 22వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్‌ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది మార్చి 18, 19 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘‘75వ భారత స్వాతంత్య్ర వేడుకలు, యూఏఈ 50 ఏళ్ల పండగ సందర్భంగా 22వ ‘ఐఫా’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. భారతీయ చిత్ర సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహిస్తాం’’అని ‘ఐఫా’ నిర్వాహకులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని