Samantha: మెగా కాంపౌండ్‌లో సామ్.. ఫొటోలు వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ ఈ వేడుకల్లో పాల్గొనడంతో మెగా కాంపౌండ్‌లో...

Published : 06 Nov 2021 10:49 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు, స్నేహితులు సందడి చేశారు. నటి సమంత సైతం ఈ వేడుకల్లో భాగమయ్యారు. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసనతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఉప్సీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు వేడుకల్లో పవన్‌ తనయుడు అకీరానందన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, అల్లు అర్జున్‌తో కలిసి అకీరా ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట అందర్నీ ఎంతో ఆకర్షిస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు