
Samantha: సామ్ నాకు ఫోన్ చేసి ఏడ్చేసింది: శ్రీనువైట్ల
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, సమంత జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దూకుడు’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా పలు ఛానల్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘దూకుడు’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో విశేషాలను ఆయన వెల్లడించారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాంబుల్‌లో ప్రారంభించామని.. సామ్-మహేశ్‌లపై కొన్ని లవ్ సీక్వెన్స్‌లు షూట్ చేశామని చెప్పారు. ‘ఇస్తాంబుల్ వెళ్లడానికి ఓరోజు ముందు మహేశ్‌బాబుకు మా ఫామ్‌హౌస్‌లో స్పెషల్ డిన్నర్ పార్టీ ఇచ్చాను. సినిమాకు సంబంధించిన కొన్ని సీక్వెన్స్‌ల గురించి చర్చించుకున్నాం. కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్‌లు కూడా చెప్పాను. దాంతో నా వర్క్‌కి మహేశ్ ఫిదా అయిపోయి అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. వెంటనే నమ్రతకు ఫోన్ చేసి.. ‘శంకర్ తెరకెక్కిస్తోన్న స్నేహితుడాలో నేను యాక్ట్ చేయనని చెప్పు’ అని అన్నారు. ఆ మాటకు అటు నమ్రత, ఇటు నేను ఇద్దరం షాక్ అయ్యాం. ‘దూకుడు’, ‘స్నేహితుడా’ ప్రాజెక్ట్‌లకు డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో మహేశ్ నా ప్రాజెక్ట్ ఓకే చేసి శంకర్‌కి నో చెప్పారు. ఆ క్షణం నుంచి నాకు ఈ ప్రాజెక్ట్ మరింత బాధ్యత పెరిగింది’ అని శ్రీను వైట్ల చెప్పారు.
అనంతరం ఇస్తాంబుల్ షూటింగ్ గురించి మాట్లాడుతూ..‘ఇస్తాంబుల్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ ఎంతో సరదాగా జరిగింది. ఆ సినిమా షూట్‌ని మేము బాగా ఎంజాయ్ చేశాం. ఓరోజు షూటింగ్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో సమంత షాపింగ్‌కు వెళ్తానని అడగ్గా.. సరే అన్నాను. బయలుదేరిన పది నిమిషాలకే ఆమె నాకు ఫోన్ చేసి బాగా ఏడ్చేసింది. ‘ఏమైంది సమంత?’ అని అడగ్గా.. ‘ఆత్మాహుతి దాడిని కళ్లారా చూసినట్లు చెప్పింది’. అక్కడ అవన్నీ సాధారణమైన విషయాలని నచ్చజెప్పాం. కానీ సామ్ మాత్రం కొన్నిరోజులపాటు అదే షాక్‌లో ఉన్నారు’ అని శ్రీను వైట్ల వివరించారు.
ఇవీ చదవండి
Advertisement