Samantha: ‘మీరు లేనిదే నేనేం చెయ్యగలను?’.. వారినుద్దేశించి సమంత పోస్ట్‌

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే నాయికల్లో సమంత ఒకరు. వ్యక్తిగత, స్ఫూర్తినింపే విషయాలకు సంబంధించి ప్రతి రోజూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూనే ఉంటారు.

Published : 05 Jan 2022 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే నాయికల్లో సమంత ఒకరు. వ్యక్తిగత, స్ఫూర్తి నింపే విషయాలకు సంబంధించి ప్రతి రోజూ ఆమె ఏదో ఒక పోస్ట్‌ పెడుతూనే ఉంటారు. అభిమానుల్ని పరోక్షంగా పలకరిస్తుంటారు. ‘ఇన్‌స్టా స్టోరీస్‌’ వేదికగా ఇటీవల ఆమె పంచుకున్న ఓ ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. దర్శక నటులు రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిశోర్‌తో కలిసి సమంత దిగిన ఫొటో ఇది. ఇందులో వీరు వేర్వేరు సోఫాల్లో విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. సంబంధిత ఫొటోకు లవ్‌ సింబల్‌ జతచేసి ‘మీరు లేనిదే నేనేం చెయ్యగలను?’ అని రాహుల్‌, కిశోర్‌లతో స్నేహాన్ని చాటిచెప్పారు. 

సినిమా విషయానికొస్తే.. ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంతో సందడి చేసిన సమంత ఈ ఏడాది పలు క్రేజీ ప్రాజెక్టులతో వినోదాన్ని పంచనున్నారు. ‘శాకుంతలం’, ‘యశోద’ వంటి పాన్‌ ఇండియా సినిమాలతో పాటు ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడిచేయనున్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని