
Samantha: ఆ విషయాలపై ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకుంటా: సమంత
హైదరాబాద్: నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం కథానాయిక సమంత తన ఫోకస్ మొత్తం కెరీర్‌పైనే పెట్టారు. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను మర్చిపోవడం కోసం వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ.. ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామ్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
తన బాలీవుడ్ ఎంట్రీపై వస్తోన్న వార్తలపై తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తాను. నాకు కూడా అక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి ఉంది. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ ఓకే చేయడంలో భాష అనేది సమస్య కానే కాదు. కథలో జీవం ఉందా లేదా? ఆ కథకు నేను సెట్ అవుతానా? పాత్రకు న్యాయం చేయగలనా?.. ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను’’ అని సమంత సమాధానమిచ్చారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో సామ్ బాలీవుడ్ సినీ ప్రియులకు సుపరిచితురాలు అయ్యారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో సామ్ రాజీ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.