Sammathame: వలపు మలుపుల్లో...

స్టార్ట్‌ అయ్యింది... అంటూ తనలో తానే మురిసిపోయాడు ఓ కుర్రాడు. తన ప్రేమకథ మొదలైందనే దాని అర్థం. మరి ఆ కుర్రాడు మనసు పడ్డ ఆ అమ్మాయి ఎవరు? ఆ ప్రేమకథ ఎక్కడిదాకా చేరిందో

Updated : 07 Dec 2022 17:52 IST

స్టార్ట్‌ అయ్యింది... అంటూ తనలో తానే మురిసిపోయాడు ఓ కుర్రాడు. తన ప్రేమకథ మొదలైందనే దాని అర్థం. మరి ఆ కుర్రాడు మనసు పడ్డ ఆ అమ్మాయి ఎవరు? ఆ ప్రేమకథ ఎక్కడిదాకా చేరిందో తెలియాలంటే ‘సమ్మతమే’ విడుదల వరకు ఆగాల్సిందే. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. చాందినీ చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. కంకణాల ప్రవీణ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. గురువారం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘క్షణమేను యుగమైన... ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే...’ అంటూ పాటతో పూర్తయ్యే ఈ ప్రచార చిత్రం ఆకట్టుకునేలా ఉంది.  ‘‘దర్శకుడు గోపీనాథ్‌రెడ్డి ఓ సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్‌ అంశాలతో కూడిన ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి జోడీ అలరిస్తుంది. ఛాయాగ్రాహకుడు సతీష్‌రెడ్డి మాసం పనితనం, శేఖర్‌ చంద్ర సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇంకో షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని